నాన్న కోసం సైనికుడిలా పనిచేసిన చైతన్య రథసారధి – బాలయ్య

-

నాన్న కోసం సైనికుడిలా పనిచేసిన చైతన్య రథసారధి హరికృష్ణ అని అన్నారు బాలయ్య. ముక్కుసూటితనం హరి మావయ్య నైజం అని టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఇవాళ.. టీడీపీ నేత, దివంగత హరికృష్ణ వర్దంతి. ఈ నేపథ్యం లోనే.. బాలయ్య సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

మా అన్న నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సంధర్భంగా ఆ మహానుభావుడికి నా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకోసం కంటే నాన్నగారి ఆశయాల కోసం ఏంతో కష్టపడ్డాడు, నాన్నగారి కోసం సైనికుడిలా పనిచేసిన చైతన్య రథసారధి, తెలుగువాడి కోసం పార్లమెంట్లో గర్జించిన నిజమైన తెలుగువాడు, ఈ రోజు ఆయన మా మధ్య లేకపోయిన ఆయన ఙ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి, నువ్వు ఎప్పుడు మాతోనే ఉన్నావు, మాలోనే ఉన్నావు హరన్న అంటూ ఎమోషనల్‌ అయ్యారు నందమూరి బాలయ్య. నందమూరి హరికృష్ణ అమర్ రహే అని పేర్కొంటూ.. అలనాటి ఫోటోను షేర్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news