తన భార్య భువనేశ్వరిపై, తన కుటుంబ సభ్యులపై వైసీపీ ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతం కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై నందమూరి ఫ్యామిలీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. నందమూరి బాలక్రిష్ణ తన సోదరిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. రెండు, మూడేళ్ల నుంచి చూస్తున్న ఘటనలు చూస్తుంటే… చాలా బాధగా ఉందన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదన్నారు.