ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రతిపక్ష నేతగా కోతలు, ప్రభుత్వ అధినేతగా వాతలు.. ఇదే జగన్ మోసపు రెడ్డి తీరు అని విమర్శించారు.
“ప్రతిపక్షనేతగా కోతలు-ప్రభుత్వ అధినేతగా వాతలు ఇదీ జగన్ మోసపు రెడ్డి గారి తీరు. నిరుపేద గిరిజనులు, దళితులకు 200 యూనిట్ల లోపు వాడుకుంటే.. ఇస్తున్న ఉచిత విద్యుత్ ఎత్తేసేందుకు ఆరు దశల పరిశీలన పేరుతో కొత్త ఎత్తుగడ వేయడం జగన్ రెడ్డి బాదుడే బాదుడు పరిపాలనకి నిదర్శనం. ఒక్క అల్లూరి జిల్లాలోనే 20 వేలకి పైగా గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ లేకుండా చేసిన వైసీపీ సర్కారు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది గిరిజనుల ఇళ్లల్లో చీకట్లు నింపుతోంది. ఉచిత విద్యుత్ ఎత్తేయడమే దగా అయితే.. పాత బకాయిల పేరుతో వేధించడం దారుణం. అమాయక, నిరుపేద గిరిజనుల్ని ఇలా దోచుకోవడం అన్యాయం సీఎం గారూ” అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు నారా లోకేష్.
ప్రతిపక్షనేతగా కోతలు-ప్రభుత్వ అధినేతగా వాతలు ఇదీ జగన్ మోసపు రెడ్డి గారి తీరు.నిరుపేద గిరిజనులు,దళితులకు 200 యూనిట్ల లోపు వాడుకుంటే..ఇస్తున్న ఉచిత విద్యుత్ ఎత్తేసేందుకు ఆరు దశల పరిశీలన పేరుతో కొత్త ఎత్తుగడ వేయడం జగన్ రెడ్డి బాదుడే బాదుడు పరిపాలనకి నిదర్శనం.#BaadudeBaaduduByJagan pic.twitter.com/0gSfWfRStX
— Lokesh Nara (@naralokesh) November 26, 2022