రాష్ట్రం నీ జాగీరా జగన్ రెడ్డి – నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రం ఏమైనా నీ జాగీరా జగన్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏమైనా ఎమర్జెన్సీ విధించావా? అని నిలదీశారు. కుప్పం పై వైసీపీ పోలీసులు అప్రకటిత యుద్ధమే ప్రకటించారని విమర్శించారు. బ్రిటిష్ చట్టానికి బూజు దులిపి అర్ధరాత్రి జీవో ఎలా తెస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ys jagan on nara lokesh

జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుకు జనాధారణ ఇంకా పెరుగుతూనే వస్తుందని అన్నారు. కుప్పం పర్యటనలో తీవ్ర ఉధృక్తత చేటు చేస్తుంది. కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షో, సభకు అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. కాసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన నియోజకవర్గానికి వెళ్లడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు అంటూ పోలీసులను ఆయన నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news