ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య – నారా లోకేష్

-

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య అని ఫైర్ అయ్యారు నారా లోకేష్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య. తెలుగు వారి ఆత్మగౌరవం స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ నెలకొల్పిన యూనివర్సిటీ ఇదని నిప్పులు చెరిగారు లోకేష్.

అసలు వైఎస్ కి, హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటి? హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్ గారు. ఈ చర్యలతో జగన్ రెడ్డి శాశ్వతంగా చరిత్రహీనుడు గా మిగిలిపోతాడని విమర్శలు చేశారు. సంక్షోభంలో సంక్షేమం అంటూ అసెంబ్లీ ముందు నిరసన తెలిపాం. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు జగన్ రెడ్డి గారు రద్దు చేశారని అగ్రహించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version