ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి : నారా లోకేశ్

-

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు నారా లోకేశ్. పోలవరం ప్యాకేజీ దగ్గర నుంచి ఎన్నో ఏళ్లుగా గిరిజనానికి హక్కుగా వస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం వరకు జగన్ రెడ్డి ఆదివాసులను నమ్మించి వంచించారని మండిపడ్డారు నారా లోకేశ్. మాటలతో కోటలు కట్టడం మాని వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు నారా లోకేశ్. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేశ్.

 

అంతేకాకుండా.. .’మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదు. పైగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటున్నారు సకల శాఖ మంత్రి సజ్జల. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అత్యాచారం కేసు నమోదు చెయ్యకుండా తగాదా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు. స్థానిక వైసిపి నేతల ఒత్తిడితో పోలీసులు కేసు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప, వారికి సహకరిస్తున్న స్థానిక వైసిపి నేతలను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చెయ్యాలి.’ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version