అంతరిక్షంలో తడి టవల్ ను పిండితే ఏమౌతుందో చూడండి..

-

భూమీద ఉన్నట్లు ఎక్కడా ఉండదు.. ముఖ్యంగా అంతరిక్షంలో చాలా వ్యత్యాసం ఉంటుంది..అక్కడ గురుత్వాకర్షణ ఉండదు. భూమిపైలాగా జీవించడం కుదరదు. అందుకే అంతరిక్షంలో నివసించే వ్యోమగాముల జీవితానికి సంబంధించిన ఏదైనా మనకు వింతగానే ఉంటుంది..అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాముల జీవితాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తరచుగా మనకు చూపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి క్రిస్ హాడ్‌ఫీల్డ్ ఐఎస్ఎస్ వద్ద తడి టవల్‌తో చేసిన ప్రయోగం వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది..ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది..అయితే అది 2013లో విడుదల చేసింది. అయితే, ఇటీవలే ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది.అంతరిక్షంలో తేలుతున్నప్పుడు తడి టవల్‌ని బయటకు తీస్తే ఇది జరుగుతుంది” అనే శీర్షికతో వండర్ ఆఫ్ సైన్స్ పేజీ ద్వారా దీన్ని ట్వీట్ చేశారు. క్రిస్ తడి వాష్‌క్లాత్‌ని తీసుకొని రెండు చేతులతో పిండుతున్నట్లు వీడియోలో చూడొచ్చు.

గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల టవల్ నుంచి విడుదలయ్యే నీరు నేలపై పడదు. బదులుగా, అది దాని చుట్టూ ‘ట్యూబ్’ని ఏర్పరుస్తుంది. కాగా, క్రిస్ అంతరిక్షంలో ఎక్స్‌ట్రావెహిక్యులర్ యాక్టివిటీ చేసిన మొదటి కెనడియన్‌గా పేరుగాంచాడు…ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news