సూర్యుడి నుంచి బలమైన సౌరజ్వాల వెలువడినట్లు నాసా ప్రకటించింది. నాసా సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ ఈ సౌరజ్వాలను గుర్తించింది. సూర్యుడి లోని ఏ.ఆర్ 2887 అనే సన్ స్పాట్ నుంచి సౌరజ్వాల శుక్రవారం వెలువడింది. అయితే భూమిపై సౌర జ్వాల ప్రభావం చూపించాలంటే.. అది వెలువడే ప్రాంతం సూర్యుడి మధ్యలో ఉండటంతో పాటు, దానికి ఎదురుగా భూమి పోజిషన్ ఉండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. సూర్యుడి నుంచి వెలువడే సౌరజ్వాలలు విపరీతమైన ప్లాస్మా సునామిని కలిగి ఉంటుంది. ఇలా వెలువడే ప్లాస్మా దాదాపుగా లక్ష కిలోమీటర్ల ఎత్తు ఉండటంతో పాటు గంటకు 1.6 మిలియన్ల వేగంతో సూర్యడి వాతావరణం నుంచి వెలువడుతుందని నాసా చెబుతోంది.
సూర్యుడి నుంచి శక్తివంతమైన సౌరజ్వాల విడుదల.. భూమికి పొంచి ఉన్న ముప్పు
-