ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహ మహోత్సవం అట్టహాసంగా ఈరోజు జరగనుంది. వివాహానికి కొద్ది గంటల ముందు అంబానీ కుటుంబం ముంబయిలోని తమ స్వగృహం ఆంటాలియాలో శివశక్తి పూజ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబ సభ్యులతోపాటు అతిథులు కూడా హాజరయ్యారు.
పూజలో భాగంగా అంబానీ ఫ్యామిలీ దుర్గాదేవి, శివుడిని విశేషంగా ఆరాధించారు. అయిగిరి నందిని అంటూ పండితుల స్తోత్రాల మధ్య దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో పూజ చేశారు. శివలింగానికి క్షీరాభిషేకం నిర్వహించి కుటుంబ సభ్యులంతా కలిసి సామూహిక హారతి ఇచ్చారు. కీర్తనలు పాడుతూ భక్త పారవశ్యంలో తేలిపోయారు. హోమం కూడా నిర్వహించారు. అనంతరం వేద పండితులు అంబానీ కుటుంబ సభ్యులకు రక్షణ కవచాలు అందించి ఆశీర్వదించారు. గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఇక ఇవాళ ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదిగా అనంత్-రాధికల వివాహం రంగంరంగ వైభవంగా జరగనుంది.