అండమాన్ ను వణికిస్తున్న ‘ అసనీ’ తుఫాన్

-

అండమాన్ నికోబార్ దీవులను తుఫాన్ వణికిస్తోంది. ‘ అసనీ’ తుఫాన్ ముంచుకొస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, కార్ నికోబార్, పోర్ట్ బ్లేయిర్ కి 100 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా 200 కిమీ దూరంలో కేంద్రీక్రుతం అయి ఉంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని… భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా పయణిస్తోంది. రేపు సాయంత్రానికి అల్పపీడనం బలపడి తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. క్రమంగా తుఫాన్ ఉత్తర దిశగా పయణించి మయన్మార్, బంగ్లాదేశ్ తీరాలకు చేరుకోనుంది.  తుఫాన్ ప్రభావంతో అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తీవం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారు. రక్షణ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు తుఫాన్ ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల అండమాన్ లోని పలు టూరిస్ట్ ప్రాంతాలను మూసివేశారు అధికారులు

 

 

Read more RELATED
Recommended to you

Latest news