WC 2023 : పాయింట్ల టేబుల్‌లో ఆస్ట్రేలియా లాస్ట్ ప్లేస్

-

ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ప్రస్తుత వరల్డ్ కప్ టోర్నీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆఫ్గాన్ గెలుపొందడంతో…జీరో పాయింట్లు, తక్కువ నెట్ రన్ రేట్(-1.846) ఉన్న ఆసీస్ అట్టడుగు స్థానానికి చేరింది. మరోవైపు భారత్, న్యూజిలాండ్ టాప్-2లో ఉన్నాయి.

Australia slip to last place in points table of 2023 ODI World Cup

కాగా…. ఆఫ్గాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు పట్టికలో ఆసీస్ కంటే ముందు స్థానంలో ఉండటం గమనార్హం. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ శ్రీలంకతో ఆస్ట్రేలియా జట్టు తలపడనుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version