Asia Cup 2023 : HYDలో మ్యాచ్‌.. BCCI కీలక ప్రకటన

-

WCలో భాగంగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఈనెల 29న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అదే టైంలో గణేష్ నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాల కారణంగా మ్యాచ్ కి ప్రేక్షకులను అనుమతించట్లేదు. కాగా, ఈ మ్యాచ్ కి ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

BCCI key announcement on Match at HYD

దీనిపై తాజాగా స్పందించిన బీసీసీఐ…టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇది ఇలా ఉండగా,  ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం ఐసీసీ 16 మందితో అంపైర్ల జాబితాను ప్రకటించింది. భారత్ నుంచి నితిన్ మీనన్ ఒక్కడికే ప్రాతినిధ్యం లభించింది. నలుగురు రిఫరీల లిస్టును విడుదల చేయగా… భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ కి అవకాశం దక్కింది. అక్టోబర్ 14న జరిగే భారత్-పాక్ మ్యాచ్ కు ఇల్లింగ్ వర్త్, ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా…. కెటిల్ బోరో థర్డ్ అంపైర్ గా, అండి పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version