ఆరోపణలు నిరూపిస్తే ఉరేసుకుంటా: బ్రిజ్‌భూషణ్

-

గత కొన్ని రోజులుగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో మన ఇండియా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెజ్లర్ల కు  దేశంలోని ప్రముఖులు అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఈ ఇష్యుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు భూషణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను లైంగికంగా వేధిస్తున్నానంటూ మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసనపై రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు భూషణ్ స్పందించారు. “5, 10 మందిని వదిలేసి శిక్షణ తీసుకుంటున్న రెజ్లర్లను అడగండి నా గురించి. నేను రాముడినో, రావణుడినో తెలుస్తుంది. నాపై చేస్తున్న ఒక్క ఆరోపణనైన రుజువు చేస్తే ఉరేసుకుంటా. నేను వేధించినట్లు ఒక్క వీడియో గాని, చాటింగ్ గాని చూపించండి” అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version