దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనే సంకల్పం చెప్పుకొన్న బీజేపీ.. ఆదిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. కర్ణాటకలో అధికారా న్ని ఏ విధంగా చేపట్టిందో అందరికీ తెలిసిందో. ఇక, తమకు అనుకూలంగా ఏపీ సీఎం జగన్‌ను మార్చుకుందనే విమర్శలు వస్తు న్నా.. కమల నాథులు లెక్కచేయడం లేదు. అదేసమయంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఓ రకమైన రాజకీయ యుద్ధమే చేస్తోంది.. కమల దళం. ఇక, ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి అవసరం వచ్చినా.. కూడా దూకుడుగా ముందుకు సాగుతోంది. దీంతో బీజేపీ విషయంలో అన్ని పార్టీలూ ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి.
అయినా ఎక్కడో ఒక వీక్ పాయింట్‌ను పట్టుకుంటున్న బీజేపీ.. దానిని అందుకుని దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇదే తరహా రాజకీయాలు పొరుగున ఉన్న మరో దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోనూ బీజేపీ చలాయిస్తోంది. దివంగత జయలలి తతో కొన్నాళ్లు పొత్తు పెట్టుకున్న మోడీ.. తర్వాత ఆమెను ఇరకాటంలోకి నెట్టారు. దీంతో ఆమె మోడీతో విభేదించారు. ఆ తర్వాత పరిణామాల్లో జయలలితకు ఎదురైన అనుభవం తెలిసిందే! ఇక, ఆమె పార్టీకి చెందిన నాయకులను ఏవిధంగా తొక్కి పెట్టారో.. ఎలా జైళ్లకు పంపారో.. రాష్ట్రంలో కథలుకథలుగా ఇప్పటికీ చెప్పుకొంటారు.
అయితే.. ఇన్ని చేసినప్పటికీ.. తమిళ తంబిలు.. ఎక్కడా బీజేపీని అక్కున చేర్చుకోలేదు. దీంతో త్వరలోనే జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరో వ్యూహానికి కమల నాథులు పావులు కదిపారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న దివంగత కరుణానిధి పార్టీ డీఎంకేలో అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలను చక్కగా వాడుకుని.. స్టాలిన్ అన్న, అసమ్మతి నాయకుడు అళగిరితో పార్టీ పెట్టించేందుకు బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
దానికి తోడు ఈనెల 21వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నైకు వస్తున్నారు. ఆ పర్యటనలో అమిత్-అళగిరి మధ్య భేటి జరగబోతోందంటు ప్రచారం జోరుగా సాగుతోంది. మరి అళగిరి కొత్త పార్టీ పెడతారా ? లేకపోతే బీజేపీలో చేరుతారా ? అన్నది అమిత్ షా భేటిలో డిసైడ్ అయిపోతుందని సమాచారం. ఏదేమైనా చావు తెలివితెలివి తేటలు ప్రదర్శిస్తున్న బీజేపీ తమిళులు ఇప్పుడైనా స్వాగతిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.