ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత

-

ముంబై ఎయిర్పోర్టులో రూ. 40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టుబడింది. ఓ థాయ్ మహిళ నుంచి రూ. 40 కోట్లు విలువ చేసే కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు అడీస్ అబాబా నుంచి వచ్చిన 21 ఏళ్ల థాయ్ మహిళను అధికారులు ముంబై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు.

Cocaine worth Rs 40 crore seized at Mumbai airport

ఆమె లగేజీని నిశితంగా పరిశీలించగామ్… తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు ఆమె ట్రాలీ బ్యాగ్ లో బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా కొకైన్ అని తేలింది. పట్టుబడిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 40 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ మేరకు సదరు మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version