రోజు రోజుకి వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి. దీనితో ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంటోంది. వంట నూనెల దిగుమతులపై పన్నులు తగ్గించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ కనుక ఇది జరిగిందంటే వంట నూనెల ధరలు కొంతవరకు తగ్గుతాయి. పామాయిల్, సోయా నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెలపై ఇప్పటి వరకు వసూలు చేస్తున్న 2.5 శాతం బేస్ ఇంపోర్ట్ టాక్స్ వుంది. అయితే ఇప్పుడు పూర్తిగా రద్ధు చేస్తున్నట్లు, ఇతర సుంకాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇక పూర్తి వివరాలని చూస్తే….
ఈ వంట నూనెలపై బేస్ ఇంపోర్ట్ టాక్స్ జీరో చెయ్యడం తో పాటుగా.. రిఫైన్డ్ చేసిన పామాయిల్, సోయా ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ పై ఇప్పటి వరకు ఉన్న బేసిక్ ఇంపోర్ట్ టాక్స్ 32.5 శాతాన్ని 17.5 శాతానికి తగ్గించినట్టు కేంద్రం అంది. ఇది ఇలా ఉంటే ముడి పామాయిల్ దిగుమతులపై కేంద్రం వసూలు చేస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ ( AIDC)ను 20 నుంచి 7.5 శాతానికి తగ్గించడం జరిగింది.
ముడి సోయా నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెలపై ఈ సెస్‌ను 20 నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనితో ముడి పామాయిల్ 8.25 శాతానికి తగ్గనుందని అన్నారు. అలానే ముడి సోయా నూనెల దిగుమతులపై సుంకాలు 24.75 శాతం నుంచి 5.5 శాతానికి.. ముడి సన్ ఫ్లవర్, శుద్ధి చేసిన సన్ ఫ్లవర్ నూనెలపై ఇప్పటి వరకు విధిస్తున్న 35.75 శాతం పన్నులు 19.25 శాతానికి తగ్గుతాయి. సుంకాల తగ్గింపు వల్ల రాబోయే కొద్ది రోజుల్లో కిలోకు రూ.6 వరకు నూనెల ధరలు తగ్గే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.