ఢిల్లీలో రోడ్డెక్కిన బుల్డోజర్లు…. ఇటీవల అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేత

-

మత ఘర్షణలకు పాల్పడే వారికి ఒక్కటే సమాధానం… బుల్డోజర్. ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా బుల్డోజర్ మంత్రాన్నే జపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మతఘర్షణల్లో మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు యోగీ మార్క్ బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ జహంగీర్ పూరి లో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో మరోవర్గం వారు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో పోలీసులతో సహా… మరికొంత మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దాడితో ప్రమేయం ఉన్న 20 మందిపైగా వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉంటే ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జహంగీర్ పూర్ ఏరియాలో ఆక్రమణలకు పాల్పడి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. దీని కోసం పెద్ద ఎత్తున్న బలగాలను ఏర్పాటు చేశారు. బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. 400 మంది పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతతో ఆక్రమదారుల నిర్మాణాలు కూల్చి వేస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఈ రకమైన చర్యలనే తీసుకుంది. మత ఘర్షణలకు కారమైన ప్రాంతాల్లో బుల్డోజర్లలో కూల్చివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news