నాకు బర్త్ డే గిఫ్ట్ గా సోనియా గాంధీ ఏం ఇస్తోంది ‌నాకు తెలియదు -డీకే శివకుమార్‌

-

నాకు బర్త్ డే గిఫ్ట్ గా సోనియా గాంధీ ఏం ఇస్తోంది ‌నాకు తెలియదని ట్రబూల్‌ షూటర్‌ డీకే శివ కుమార్‌ అన్నారు. నాకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ ఇస్తోందో లేదో ‌నాకు తెలియదని వివరించారు. కాంగ్రెస్ హై కమాండ్‌కి నిర్ణయం వదిలేసాం.. నేను కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి విధేయుడిని అని తెలిపారు డీకే శివ కుమార్‌.

ఇవాళ నా పుట్టిన రోజు.. నేను కొన్ని పూజలు చేయాలి.. నా విశ్వాసం ప్రకారం ఆ పూజలే నన్ను కాపాడుతాయి.. కర్ణాటక కాంగ్రెస్ కోసం ఏమేమి చేయాలో అవన్ని చేశాం.. ప్రజలు నన్ను.. కాంగ్రెస్‌ను నమ్మారన్నారు డీకే శివ కుమార్‌. కాగా, నేడు ఢిల్లీకి డికే శివకుమార్, సిద్ధరామయ్య వెళ్లనున్నారు. కర్ణాటక సీఎం ఎవరు అవుతారనే దానికి ఉత్కంఠ ఉన్న తరుణంలో.. నేడు ఢిల్లీకి డికే శివకుమార్, సిద్ధరామయ్య వెళ్లనున్నారు. నేడు డీకే శివకూమార్ పుట్టిన రోజు…డికే పుట్టిన రోజు గిఫ్ట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తాందా ? లేదా అన్న టెన్షన్ లో డికే అనుచరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version