లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఈసీ కీలక హెచ్చరిక

-

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్   ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్ గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యర్థులను దూషించే విధంగా, అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని అజ్వైజరి జారీ చేసింది.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీలకు, నేతలకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ప్రచారంలో భాగంగా తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేయొద్దని సూచించింది. అంతేకాకుండా సామాజిక వర్గం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగొద్దని, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని తెలిపింది. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చింది. ఇక ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version