కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంట్లో ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతా మెడికల్ విద్యార్థినిపై హత్యాచారం కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు మాజీ ప్రిన్సిపల్ యత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హాస్పిటల్లో అనేక అవకతవకలకు ఆయన పాల్పడినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.
విధుల్లో భాగంగా ఆయన ఆర్థిక అవకతవకలపై పోలీసుల దృష్టిసారించారు.తాజాగా పక్కా సమాచారంలో ఈడీ అధికారులు ఉదయం నుంచే ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, విద్యార్థిని హత్యాచారం కేసులో ఈనెల 2 హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ దాడుల నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.