పసిడి ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.940 పెరిగి.. ప్రస్తుతం రూ.62,020కి చేరుకుంది. ఇది జీవితకాల గరిష్ఠ స్థాయి. మరోవైపు, కిలో వెండి ధర రూ.660 పెరిగి.. ప్రస్తుతం రూ.76,700 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.62,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.76,700 రూపాయలుగా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,020గా ఉంది. కిలో వెండి ధర రూ.76,700 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,020 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.76,700గా ఉంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపును నిలిపివేస్తుందనే సూచనలతో డాలర్ విలువ క్షీణించింది. దీంతో గురువారం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల పెంపుదల కొనసాగితే బంగారం ధరపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.