2021తో పోలిస్తే ఐదు నుంచి ఎనిమిదో స్థానానికి చేరినా ఆందోళనకర పరిస్థితులు తొలగినట్టు కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నివేదికను శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు గుర్తించిన పీఎం 2.5 స్థాయి కాలుష్య కారకం ఆధారంగా రూపొందించారు. 131 దేశాలకు చెందిన 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. పీఎమ్ 2.5 వల్ల 20 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.