చైనాకు చెక్‌పెట్టే సరికొత్త ఆయుధం ‘జొరావర్‌’

-

తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా దూకుడును కట్టడి చేసేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-DRDO, ప్రైవేటు సంస్థ ఎల్‌ అండ్‌ టీ సంయుక్తంగా జొరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును డిజైన్ చేశాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు. DRDO చీఫ్ డాక్టర్‌ సమీర్ వీ కామత్‌ గుజరాత్‌లోని ఎల్‌ అండ్‌ టీ ప్లాంట్‌ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

జొరావర్ తేలిక పాటి యుద్ధ ట్యాంకులను 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమీర్ వీ కామత్‌ తెలిపారు. తూర్పు లద్ధాఖ్‌లోని ఎత్తైన ప్రదేశాలలో మోహరించేందుకు ఉద్దేశించిన ఈ యుద్ధ ట్యాంకులను రెండేళ్లలోనే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రరష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులో అన్ మ్యాన్డ్ సర్ఫేస్ వెహికిల్ అ నే సాంకేతికతను జోడించారు. ఇది మానవ ప్రమేయం లేకున్నా పని చేస్తుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version