జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఉగ్రవాదుల హతం

-

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల కాలంలో వరసగా ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులు ఏదైనా ఘటనలకు పాల్పడిన కొన్ని రోజుల్లోనే వారిని అంతమొందిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామాలోని ద్రాబ్ గామ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో గాలింపు చేపట్టిన భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ జరిగింది. 

ఈ ఎన్ కౌంటర్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ముగ్గురు కూడా స్థానికంగా ఉండే వారే అని పోలీసులు గుర్తించారు. మే 13న పోలీస్ రియాజ్ అహ్మద్ ను చంపిన కేసులో హతమైన ఉగ్రవాది షీర్ గోజ్రీ ప్రమేయం ఉన్నట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. చనిపోయిన మరో ఇద్దరు ఉగ్రవాదులను పుల్వామా జిల్లాకు చెందిన ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ ఆహ్ మాలిక్ గా గుర్తించారు. వీరి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్స్, పిస్టల్, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news