Maharashtra: సీట్ల పంపకంపై షిండేతో సమావేశమైన జేపీ నడ్డా

శివసేనలో తిరుగుబాటు లేవదీసి, విజయవంతంగా ఉద్ధవ్ ఠాక్రే ను సీఎం పదవి నుంచి దింపి, ముఖ్యమంత్రి అయిన ఎక్నాధ్ షిండే.. పాలనలో తొలి అడుగులు వేస్తున్నారు. మిత్ర పక్షం బీజేపీతో కలిసి కొత్త మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నారు. షిండే మంత్రివర్గంలో బిజెపి తరఫున 25 మంది మంత్రులు ఉండవచ్చని తెలుస్తోంది. కాగా తనకు మద్దతు ఇచ్చిన శివసేన తిరుగుబాటు వర్గం నుంచి కనీసం 13 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

బీజేపీ, శివసేన ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం శివసేన( షిండే వర్గం) లోని ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి, బీజేపీలోని ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై నేడు బీజేపీ శివసేన ల మధ్య సీట్ల పంపకంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల తో సమావేశం కానున్నారు.