పాదయాత్రలో జగన్…ప్రభుత్వంలో జగన్…రెండు క్యారెక్టర్ల మధ్య చాలా తేడా కనిపిస్తుందా? అంటే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు…ప్రతిపక్షంలో ఉండగా జగన్ పాదయాత్ర చేస్తే..ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన విషయం తెలిసిందే..అసలు జగన్ ఎక్కడకు వెళితే..అక్కడకు గుట్టలు గుట్టలుగా జనం వచ్చారు..అలాగే పవర్ ఫుల్ స్పీచ్ లతో అదరగొట్టేసేవారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సత్తా చాటిన జగన్..అధికారంలోకి వచ్చాక ఇంకా అదరగొట్టేయాలి. కానీ అలా జరుగుతుందా? అంటే ప్రస్తుతం జగన్ స్పీచ్ లు చూస్తుంటే అలా లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎం అయిన దగ్గర నుంచి ఆయన స్పీచ్ ల్లో అంతగా పవర్ ఉన్నట్లు కనిపించడం లేదని అంటున్నారు…ఎప్పుడు పేపర్ లో చూసుకుని చదువుతున్నట్లే ఉందని చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగా జగన్ కూడా ఎప్పుడు చెప్పింది చెప్పి…జనాలకు బోరు కొట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో జగన్ స్పీచ్ చూసిన ప్రతి ఒక్కరికీ అలాగే అనిపిస్తోంది. ఆఖరికి ప్లీనరీ సమావేశాల్లో కూడా అదే సీన్ కనిపించింది. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియాపై విమర్శలు…అలాగే తమ పాలనపై పొగడ్తలు…అది కూడా ఎవరో రాసి ఇస్తే చదువుతున్నట్లే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక వైసీపీ నేతలు కూడా అదే రూట్ లో ఉన్నారు…ఇంకా వారు జగన్ కు భజన చేయడంలో, చంద్రబాబుని తిట్టడంల పోటీపడ్డారు. ఇలాగే ముందుకెళితే..జగన్ కే ఇబ్బంది అని చెప్పొచ్చు. తమ ప్రభుత్వం చేసిన పనులని చెప్పుకోవచ్చు…కానీ మరీ డప్పు కొట్టుకోకూడదు…గతంలో చంద్రబాబు ఇలాగే తెగ డప్పు కొట్టుకునేవారు…ఇప్పటికీ ఆయన అదే పనిలో ఉన్నారనుకోండి. మరి ఆయనలాగే జగన్ కూడా చేస్తే జనం మద్ధతు పెరుగుతుందా? అంటే చెప్పడం కష్టం. తమ ప్రభుత్వం చేసిన పనులని చెప్పుకుంటూనే..తప్పులని కూడా మాట్లాడుకుంటే బాగుండేది అని, అసలు ఇంతవరకు ఏ తప్పు జరగనట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని, పైగా తమ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అంటున్నారు…మరి ఆ విషయం ప్రజల్లోకి వచ్చి అడిగితే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు…ఏదేమైనా ఇకనుంచైనా జగన్ రూట్ మార్చి..ప్రజలని ఆకర్షించేలా మాట్లాడితే బెటర్ అని సూచిస్తున్నారు.