రేపు మణిపుర్‌లోని 11 కేంద్రాల్లో రీ-పోలింగ్‌

-

ఈ నెల 19వ తేదీన సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినా.. హింసాత్మక రాష్ట్రంలో మాత్రం హింస మరోసారి చెలరేగింది. దీంతో ఆ పోలింగ్ను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రేపు ఓటింగ్ జరగనుంది.

మణిపుర్‌లోని 11 పోలింగ్‌ స్టేషన్‌లలో మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇన్నర్‌ మణిపుర్‌ లోక్‌సభ స్థానంలోని 11 చోట్ల రీ పోలింగ్‌ను సోమవారం రోజున ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 19న ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం, బూత్ క్యాప్చరింగ్‌ వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికలను చెల్లనివిగా ఈసీ ప్రకటించింది. కాంగ్రెస్‌ మాత్రం ఇన్నర్‌, ఔటర్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 47 పోలింగ్‌ బూత్ క్యాప్చరింగ్‌ జరిగిందని, అన్ని చోట్లా రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version