వలసబాట పట్టిన మణిపుర్.. మిజోరంలో 5800 మంది ఆశ్రయం

-

ఈశాన్య రాష్ట్రం మణిపుర్​ను మొన్నటివరకు ఆగ్రహ జ్వాలలు అట్టుడికించాయి. ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ అంశం చిచ్చుపెట్టింది. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్‌ ట్రైబల్‌ స్టూటెండ్స్‌ యూనియన్‌ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడికింది. హింసలో గ్రామాలకు గ్రామాలు తగులబడిపోయాయి.

ఈ క్రమంలో మైతీలు, గిరిజనుకు మధ్య పరస్సర దాడులు పెరడంతో రాష్ట్రం నుంచి చాలా మంది వలసబాటపట్టారు. మణిపుర్‌కు చెందిన 5800 మందికిపైగా మిజోరంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వారంతా చిన్ ‌, కుకి , మిజో తెగలకు చెందివారని అధికారులు తెలిపారు.

వలస బాట పట్టిన వారందరూ మిజోరంలోని ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తల దాటుకుంటున్నారని వెల్లడించారు. ఐజ్వాల్‌ జిల్లాలో అత్యధికంగా 2021 మంది ఆశ్రయం పొందుతున్నారని, తర్వాత 1847 మందితో కొలాసిబ్‌, 1790 మందితో సైతువాల్‌ జిల్లాల్లో ఉన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news