ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

-

చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతేవాడ – నారాయణపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో వివిధ ఆయుధాలతో పాటు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం ధంతేవాడ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే ఆబూజ్ మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంలో మావోయిస్టులు – పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందగా.. వారి మృతదేహాలతో పాటు భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు – మావోయిస్టులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా ఆపరేషన్ గ్రీన్ హంట్ ను ముమ్మరంగా చేస్తుంది కేంద్రం. భద్రత బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తూ.. మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా దూకుడుగా వెళ్తోంది. గతేడాది కాలంలోనే పలు ఎన్కౌంటర్లలో 150 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version