సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష

-

సూడాన్‌లో సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌కు మధ్య భీకర పోరాటం జరుగుతోంది. ఇందులో వందల మంది పౌరులు, సైనికులు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. దీంతో అక్కడున్న సుమారు 4వేల భారత పౌరుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అక్కడున్న వారిని అప్రమత్తం చేసింది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సూడాన్‌లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో విదేశాంగమంత్రి జైశంకర్‌, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ అధినేతలతోపాటు విదేశాంగ, రక్షణశాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్‌ దౌత్యవేత్తలు పాల్గొన్నట్లు తెలిపాయి.

‘సూడాన్‌లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. భారతీయుల రక్షణ, వారి భద్రతపై దృష్టి సారించాం. అక్కడి నుంచి తరలించే సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తున్నాం’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ తరుణంలో ఐరాస సెక్రటరి జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌తో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. సాధ్యమైనంత తొందరగా ముందస్తు కాల్పుల విరమణ కోసం దౌత్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version