హ్యాట్రిక్ పీఎం మోదీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

-

మరికొన్ని గంటల్లో బీజేపీ  నరేంద్ర మోదీ భారత ప్రధానిగా వరుసగా మూడోసారి  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత మూడుసార్లు పీఎం పీఠం ఎక్కింది మోదీయే. 1985 నుంచి బీజేపీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోదీ.. అంచెలంచెలుగా ఎదిగి, ప్రధాని స్థాయికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం.

  • 2001లో తొలిసారి గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
  • ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగి 2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమలం పార్టీకి సంపూర్ణ మెజార్టీ సాధించిపెట్టారు. 1984 తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా గుర్తింపు పొందారు.
  • అంతర్జాతీయంగా భారత్‌ను తయారీ రంగానికి గమ్యస్థానంగా మార్చేందుకుగానూ 2014 సెప్టెంబరులో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు శ్రీకారం చుట్టారు.అదే ఏడాది అక్టోబరు 2న ‘స్వచ్ఛ భారత్‌ అభియాన్‌’ను ప్రారంభించారు.
  • ఉరీ దాడులకు ప్రతీకారంగా 2016లో పాకిస్థాన్‌ భూభాగాల్లోని ఉగ్రమూకలపై మెరుపుదాడులు నిర్వహించారు.
  • అదే ఏడాది నవంబరులో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. నేడు దేశంలో ప్రతినెలా సగటున రూ.18 లక్షల కోట్ల విలువైన ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుగుతున్నాయి.
  • 2017లో మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌, రైల్వే బడ్జెట్‌ను ఏకీకృతం చేసింది. దీంతో 1924 నుంచి వేర్వేరుగా ప్రవేశపెడుతోన్న సంప్రదాయానికి ముగింపు పలికినట్లయ్యింది.
  • జులై 1న జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. 2019లో పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్‌ దాడులు జరిపింది.
  • రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ని రద్దు చేశారు. అనంతర కాలంలో సీఏఏ, ముమ్మారు తలాక్‌ రద్దు,  అయోధ్యలో రామాలయ నిర్మాణం, మహిళా రిజర్వేషన్ల వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
  • మోదీ పాలనలో ‘గ్లోబల్‌ సౌత్‌’కు భారత్‌ గొంతుకగా మారింది. ‘జీ20’ శిఖరాగ్ర సదస్సు విజయం.. ప్రపంచ వేదికపై దేశ స్థాయిని బలోపేతం చేసింది.
  • గత ఏడాది నవంబరులో ‘చంద్రయాన్‌-3’ ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్‌ అవతరించింది.
  •  ‘మన్‌కీ బాత్‌’తో కోట్లాది ప్రజలకు చేరువయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version