కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఈ కూటమి 293 సీట్లు సాధించింది. ఇండియా కూటమి 233 సీట్లతో సరిపెట్టుకున్నది. దీంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 09న సాయంత్రం 06 గంటలకు ఢిల్లీలోని కర్తవ్యపఢ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
రేపు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో 7 దేశాల అధ్యక్షులు, ప్రధానులు రానున్నారు.
రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న అథితులు
- శ్రీలంక అధ్యక్షుడు, HE Mr. రణిల్ విక్రమసింఘే;
- మాల్దీవుల అధ్యక్షుడు, HE డా. మొహమ్మద్
ముయిజ్జు; - సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్, HE Mr. అహ్మద్ అఫీఫ్;
- బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి, HE షేక్ హసీనా;
- మారిషస్ ప్రధాన మంత్రి, HE Mr. ప్రవింద్ కుమార్ జుగ్నాథ్;
- నేపాల్ ప్రధాన మంత్రి, HE Mr. పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’;
- భూటాన్ ప్రధాన మంత్రి, HE Mr. షెరింగ్ టోబ్గే