ముగిసిన నిర్మల సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

-

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తెలంగాణ తరఫున జిఎస్టి కౌన్సిల్ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తులు వినిపించారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మత్తులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు. సుమారు 6 నెలల తర్వాత నిర్మల సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో 15 అంశాలలో కేవలం ఎనిమిది అంశాలపైనే చర్చించారు.

అయితే సమయాభావం వల్ల కొన్ని అంశాలపై చర్చ జరగలేదని వెల్లడించారు. భేటీ అనంతరం ఉన్నతాధికారులతో కలిసి నిర్మల సీతారామన్ మీడియాతో మాట్లాడారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించి మేఘాలయ సీఎం కన్రాడ్ నేతృత్వంలో ఏర్పాటు అయిన మంత్రుల బృందం సమర్పించిన సిఫార్సులు ఈ భేటీలో చర్చకు రాలేదు. అయితే ఈ సమావేశానికి రెండు రోజుల ముందు నివేదిక సమర్పించడం వల్ల దీనిపై చర్చించడం వీలు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version