జమ్ముకశ్మీర్ టెర్రర్ అటాక్ పాక్ ఉగ్రసంస్థ పనే

-

జమ్ముకశ్మీర్‌ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో 9 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి పాకిస్థాన్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ద రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. ఆ దాడి చేసింది తామేనని.. కశ్మీర్‌ ప్రాంతంలో అలాంటి ఉగ్రదాడులు మరిన్ని చేస్తామని ఈ ముష్కర సంస్థ హెచ్చరించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగబడతామని ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించింది. ఉగ్రదాడి నేపథ్యంలో రియాసిలో హై అలెర్ట్‌ కొనసాగుతోంది. భారీగా రంగంలోకి దిగిన సైన్యం డ్రోన్లతో ముష్కర వేట ముమ్మరం చేసింది.

వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించి మరో మందిరానికి వెళ్తున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన యాత్రికుల బస్సుపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపగా.. అదుపు తప్పిన బస్సు లోయలో పడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 41మంది గాయపడ్డారు. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ దాడిలో హస్తమున్న ప్రతీ ఒక్కరికి శిక్షపడుతుందని హెచ్చరించినట్లు ఎల్జీ కార్యాలయం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version