పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటాం: ప్రధాని మోదీ

-

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నూతన పార్లమెంట్ భవనంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. 75 ఏళ్ల పార్లమెంటుపై చర్చే ప్రధాన అజెండా ఈ చర్చలు సాగనున్నాయి. అయితే ఈ సమావేశాల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.

“జీ-20 సదస్సు అద్భుతంగా జరిగింది. భారత ఉజ్వల భవిష్యత్తుకు జీ-20 సదస్సు మార్గదర్శనం చేసింది. చంద్రయాన్‌-3 విజయంతో దేశానికి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్‌ పయనిస్తోంది. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుంది. భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ వినాయక చవితి రోజును జరగబోయే ఈ సమావేశాల్లో తీసుకోబోయే నిర్ణయాలతో.. మున్ముందు భారత అభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఈ పార్లమెంటు సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటాం.” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version