యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ

-

మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన పద్దు 2024-25పై మాట్లాడారు.

యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ ఇది అని ప్రధాని మోదీ అన్నారు. బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామని తెలిపారు. మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్ ఇది అనని చెప్పారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్‌ అని వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామన్న మోదీ.. చిరువ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్తబాటలు వేశామని తెలిపారు. మౌలిక, తయారీ రంగాలను బలోపేతం చేసేలా బడ్జెట్ ఉందని.. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చామన్న ప్రధాని.. ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ స్కీమ్‌ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన చేస్తామని.. కొత్త ఉద్యోగులకు తొలి జీతం మా ప్రభుత్వమే అందిస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version