PM Modi to visit Italy: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ దేశ పర్యటన ఖరారు అయింది. నేడు ఇటలీకి వెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడు రోజులపాటు జరిగే జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ వెళ్లనున్నారు. ఈ సదస్సులో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.
ప్రధానితోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రా, జాతీయ భద్రతాధికారి (ఎన్‌ఎస్‌ఏ) అజీత్ డోభాల్‌లతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇటలీ వెళుతున్నట్లు వెల్లడించాయి.
కాగా, ఈ పర్యటనపై, సదస్సుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తీవ్రవాదం, హింసను సమర్థించే భారత్ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తూనే ఉందని.. ఆ దేశంతో అదే ప్రధాన సమస్య అని భారత విదేశాంగ పేర్కొంది. అటువంటి శక్తులపై ట్రూడో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది.