సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు.. మూణ్నెళ్ల క్రితమే రైల్వే ఆఫీసర్ వార్నింగ్

-

ఒడిశా రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు’ కారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థపై మూణ్నెళ్ల క్రితం ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి హెచ్చరించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి గతంలోనే ఎత్తిచూపిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

నైరుతి రైల్వే జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ తన ఉన్నతాధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ లేఖ రాశారు. అంతకుముందు రోజు చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటనను అందులో ప్రస్తావించారు. ‘‘ఫిబ్రవరి 8న సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. నాడు వాస్తవానికి అప్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకు ఆ రైలుకు తొలుత అనుమతి లభించింది. కానీ కొద్దిదూరం వెళ్లాక డౌన్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా ఇంటర్‌లాకింగ్‌ ఉండటం కనిపించింది. దాన్ని గుర్తించిన లోకోపైలట్‌ అప్రమత్తమయ్యారు. రైలును వెంటనే నిలిపివేశారు. ఇంటర్‌లాకింగ్‌ ఉన్న ప్రకారం వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదే. సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది’’ అని లేఖలో వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version