వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..భారీగా పెరగనున్న గృహ, వాహన రుణాల ఈఎంఐలు

-

BREAKING : ముంబై: వడ్డీ రేట్లపై ఆర్బీఐ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తి కాంత దాస్‌ అధికారిక ప్రకటన చేశారు.

ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం తో గృహ, వాహన రుణాలపై మరింత భారం పడనుంది. 5.4 శాతం నుంచి 5.9 శాతానికి రెపో రేటు పెంచారు. దీంతో ఈ ఏడాదిలో 4 సార్లు వడ్డీరేట్లు ఆర్బీఐ పెంచినట్లైంది.

ఈ వడ్డీ రేట్ల పెంపుతో.. గృహ, వాహన, ఇతర రుణాలపై మరింత భారం పడనుంది. అంటే.. ఈఎంఐలు భారీగా పెరగనున్నాయి. దీంతో సామాన్య ప్రజలపైనే ఎక్కువగా భారం పడనుంది. ద్రవ్యోల్భణానికి కళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తి కాంత దాస్‌ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news