కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత గొప్ప ఆటగాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఎదిగిన ఒదిగినట్లు ఉండే రోహిత్ AUSతో వన్డే సిరీస్ గెలిచాక చేసిన పనికి ప్రశంసలు పొందుతున్నారు. మ్యాచ్ అనంతరం ట్రోఫీని తన చేతుల్లోకి తీసుకున్న రోహిత్ దానిని మొదటి రెండు వన్డేలకు కెప్టెన్సీ వహించిన రాహులకు అందించారు. జట్టులోని ప్రతి ఆటగాడిని రోహిత్ ఎంతగా గౌరవిస్తాడో అనడానికి ఇదే నిదర్శనం అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
కాగా, ప్రపంచ కప్ నకు ముందు టీమిండియా కు ఊహించని షాక్ తగిలింది. ఆసీస్ పై రెండు వన్డేలు గెలిచిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో మాత్రం ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ స్పిన్ మ్యాజిక్ కు టీమిండియా తలవంచింది. 353 పరుగుల భారీ లక్ష్యచేదనలో టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుపులకు ఆల్ అవుట్ అయింది. అన్ని రంగాల్లో రాణించిన ఆసీస్ 66 పరుగులు తేడాతో గెలిచి ఊరట పొందింది.