రాజస్థాన్ పగ్గాల కోసం కలిసిపోయిన గహ్లోత్, పైలట్..!

-

కర్ణాటక కాంగ్రెస్ ఫలితాలను దేశవ్యాప్తంగా రిపీట్ చేయాలనే ఊపులో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకోవడంపైనా.. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంపైనా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్​లో ఉన్న వర్గపోరుకు ముగింపు పలికే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్​తో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు.

“వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. రాజస్థాన్ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటాం. అశోక్ గహ్లోత్​, సచిన్ పైలట్ ఇద్దరూ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. మాది బీజేపీపై ఉమ్మడి పోరు. రాజస్థాన్​లో మళ్లీ అధికారం మాదే” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికి ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ వెళ్లారు. ఆ తర్వాత రాహుల్​ అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరితో గహ్లోత్​ భేటీ అయినట్లు తెలిసింది. రాత్రి 8 గంటల సమయంలో సచిన్​ పైలట్​.. రాహుల్​, ఖర్గేతో సమావేశమయ్యారు. చాలా నెలల తర్వాత హైకమాండ్​ సమక్షంలో అశోక్​ గహ్లోత్​- సచిన్​ పైలట్​ ముఖాముఖి సమావేశం ఇదే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version