కోవిడ్‌ మృతులకు పరిహారం చెల్లించాల్సిందే: సుప్రీం

-

కోవిడ్‌తో మహమ్మారి కారణంగా మృతి చెందిన కుటుంబాల‌కు ప‌రిహారం అందించాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కోవిడ్‌ మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం అంశంపై బుధవారం సుప్రీం కోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా మృతులకు ప‌రిహారంపై జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

 కోవిడ్‌/సుప్రీం కోర్టు
కోవిడ్‌/సుప్రీం కోర్టు

కోవిడ్‌ మృతులకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఎంత పరిహారం చెల్లించాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలని పేర్కొంది. ప‌రిహారం చెల్లింపుకు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల‌ని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అథారిటీను సుప్రీం ఆదేశించింది. ఆరు వారాల‌ వ్య‌వ‌ధిలోగా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌యారు చేయాల‌ని స్పష్టం చేసింది. డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ చట్టంలోని 12వ సెక్ష‌న్ ప్ర‌కారం న‌ష్ట‌ప‌రిహారాన్ని నిర్ణయించనున్నారు.

ఇక కోవిడ్‌తో చ‌నిపోయివారికి ఇచ్చే డెత్ స‌ర్టిఫికేట్‌లో తేదీ, ఏ కార‌ణం చేత మ‌రణించాడో ఉండాల‌ని తెలిపిన సుప్రీం కోర్టు…మృతి ప‌ట్ల ఏదైనా అనుమానం ఉంటె ఆ స‌ర్టిఫికేట్‌లో మార్పుల కోసం అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది. కాగా కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరుతూ ఇటీవలే పిటిషన్‌ దాఖలవగా… పరిహారం ఇవ్వలేమని కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పిన విషయం తెల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news