తమిళనాడు బీజేపీ మూడో విడుత అభ్యర్థుల జాబితా విడుదల

-

తమిళనాడులో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను తాజాగా విడుదల చేసింది బీజేపీ. మూడో విడుతలో 9 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. వీరిలో చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి. సెల్వన్, వెల్లూరు నుంచి శన్ముగం, కృష్ణగిరి నుంచి సి.నరసింహన్, నీలగిరి(ఎస్సీ) నుంచి ఎల్.మురుగన్, కోయంబత్తూరు నుంచి అన్నామలై, పెరంబలుర్ నుంచి టీ.ఆర్.పర్వేందర్, తూత్తుకూడి నుంచి నైనార్ నాగేంద్రన్, కన్యకుమారి నుంచి రాధాకృష్ణన్ లోక్ సభ ఎంపీలుగా పోటీ చేయనున్నారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి ఫేజ్లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. బుధవారమే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో మూడో జాబితాలో కేవలంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పేర్లు మాత్రమే ఉన్నాయి. తొలి విడతలో 195 మందిని వెల్లడించింది. అందులో ప్రధాని మోడీ పేరు ప్రకటించారు. మూడోసారి వారణాసి నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. అనంతరం సెకండ్ లిస్టులో 72 మంది పేర్లను ప్రకటించింది. ఈ రెండు జాబితాలో తమ పేర్లు లేవని కీలక నేతలు అలకబూనారు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సదానందగౌడ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version