ప్రాణ ప్రతిష్టకు ముందే బాల రాముడి దివ్య రూప దర్శనం

-

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే రామ మందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీరాముడి దివ్య రూపం భక్తులకు దర్శనం ఇచ్చింది. భవ్య మందిరంలోని గుర్భగుడిలో ప్రతిష్టించనున్న బాలరాముడి విగ్రహం ఫొటోలు బయటికి వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగులాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. 

అయితే గురువారం అర్థరాత్రి గర్భాలయానికి బలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరాముడిని గర్భగుడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం బాలరాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీనిని చూసిన భక్తులు జై శ్రీరామ్ అంటూ.. పులకించి పోతున్నారు. గర్భాలయంలో నిలుచున్న రూపంలోనే రామ్ లల్లా దర్శనమిస్తాడు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట జనవరి 22న సోమవారం మధ్యాహ్నం 12.20 నుంచి 1.00గంటల మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version