భగ్గుమంటున్న టమాట.. రూ.300కు పైనే పలుకుతున్న ధర

-

టమాట ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటిదాక రూ.150 వరకు ఉన్న ధరలు ఇప్పుడు ఏకంగా రూ.300 నుంచి రూ.400 దాకా ఎగబాకాయి. ముఖ్యంగా చండీగఢ్ మార్కెట్​లో టమాట ధర తారా స్థాయికి చేరుకుంది. కిలో టమాటా ధర రూ. 200 నుంచి 250 వరకు పలుకుతోంది. అదే రిటైల్ దుకాణాల్లో​ అయితే ఏకంగా రూ. 300 నుంచి 400 లకు విక్రయిస్తున్నారు. కాస్త తక్కువ నాణ్యత గల టమాటా అదే మార్కెట్​లో రూ. 100 – 150గా ఉంది. పెట్రోల్ కంటే టమాట ధరలే ఎక్కువగా ఉన్నాయని సామాన్యులు వాపోతున్నారు.

భారీ వర్షాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కూరగాయల  విక్రయదారులు చెబుతున్నారు. చండీగఢ్​కు ప్రధానంగా పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్​ రాష్ట్రాల నుంచే కూరగాయలు వస్తుంటాయి. ముఖ్యంగా టమాటా, ఉల్లి నాశిక్ నుంచి వస్తాయి. కానీ నిరంతర వర్షాల వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి.. రవాణా నిలిచిపోయింది. చండీగఢ్ మార్కెట్​కు సోలన్​ జిల్లా నుంచే టమాటా సరఫరా అవుతున్నాయని విక్రయదారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version