మహారాష్ట్ర అమరావతిలో దీపావళి పూట ప్రమాదం చోటుచేసుకుంది. మల్ఖేడ్ రైల్వే గ్రామం సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బల్హర్షా నుంచి భుసావల్ వెళ్తున్న సరకు రవాణా రైలు బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రమాదంలో 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటన సమయంలో భారీ శబ్దం రావడం వల్ల రైల్వే సిబ్బంది, స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీపావళి పండుగ రోజున ఇలా మూడు, నాలుగు గంటలపాటు రైళ్లు ఆలస్యంగా ప్రయాణించడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.