Delhi Assembly Election 2025 : ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా..? మోడీ సంచలన వ్యాఖ్యలు

-

యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల వేళ.. ఈ వ్యాఖ్యలు ఆప్, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమ్ ఆద్మీపార్టీ పై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని ప్రశ్నించారు.

ఢిల్లీ మాజీ సీఎం హర్యానా ప్రజలపై అసహ్యకరమైన ఆరోపణలు చేసారు. ఓటమి భయంతో ఆపద నేతలు ఆందోళన చెందుతున్నారు. హర్యానా, ఢిల్లీలో నివసించే ప్రజలు ఒకరు కాదా..? హర్యానా ప్రజల బంధువులు దేశ రాజధానిలో లేరా..? తమ సొంత ప్రజలు తాగే నీటిని విషపూరితం చేస్తారా..? హర్యానా పంపుతున్న నీరు ఢిల్లీలో ప్రతీ ఒక్కరూ వినియోగిస్తున్నారు. అందులో ఈ ప్రధాని కూడా ఉన్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version