హైదరాబాద్‌లో త్వర‌లో ప్రకృతి వైద్య శాల : హరీష్‌రావు

-

హైదరాబాద్‌ వాసులకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ శుభవార్త చెప్పింది. కార్పొరేట్ జంగిల్‌గా మారిపోయిన హైద‌రాబాద్‌లో గ‌డ‌చిన కొన్నేళ్లుగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప‌చ్చ‌ద‌నం అల‌రారే న‌గ‌రంగా పేరుతెచ్చుకున్న హైద‌రాబాద్‌లో త్వ‌ర‌లో ప్ర‌కృతి వైద్య శాల అందుబాటులోకి రానుంది. అది కూడా ప్ర‌భుత్వ రంగంలో. ఈ మేర‌కు శ‌నివారం కీల‌క ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌ రావు. త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్న ఈ ప్ర‌కృతి వైద్య శాల ఏకంగా 10 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇందుకోసం రూ.6 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు మంత్రి హరీష్ రావు.

అంతేకాకుండా నేచ‌ర్ క్యూర్‌గా పేరు పెట్ట‌నున్న ఈ వైద్య శాల నిర్మాణ ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని కూడా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్ రావు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వం ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు మంత్రి హరీష్ రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version