దేశవ్యాప్తంగా సంచలన రేపింది మహారాష్ట్రలోని హనుమాన్ చాలీసా వివాదం. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామన చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో శివసేన కార్యకర్తలు ఏకంగా ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై పోలీసులు నవనీత్ దంపతులపై కేసులు పెట్టి జైలుకు పంపించారు.
దాదాపుగా 10 రోజుల తర్వాత నవనీత్ దంపతులకు బెయిల్ మంజూర్ చేసింది. బెయిల్ ఇస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. విచారణకు ఇద్దరూ సహకరించాలని ఆదేశించింది. అలాగే విచారణకు 24 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పాటు సాక్ష్యాధారాలను ప్రభావితం చేవద్దని… మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని షరతులు విధించింది. సాయంత్రంలోగా నవనీత్ కౌర్ దంపతులు జైలు నుంచి విడుదల కానున్నట్లు వారి లాయర్ రిజ్వాన్ మర్చంట్ వెల్లడించారు.