ఏవోబీలో భారీ డంపు..పోలీసులే టార్గెట్!

విశాఖ ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్‌లో పోలీసులకు మావోయిస్టులకు ఆధిపత్యపోరు కొనసాగుతుంది..ఎలాగైన తమ ఉనికిని చాటుకోవాలిని మావోస్టులు ప్రయత్నిస్తుంటే..నక్సలైట్ల ఉనికి లేకుండా చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..తాజాగా పోలీసులను టార్గెట్ చేసేకొని పెట్టిన భారీ ఆయుధ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

గున్న మామిడి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దాదాపు రెండు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి.. ఘటనా స్థలిలో ట్యాబ్లు, స్టార్ గుర్తు ఉన్న టోపీలు లభించడంతో పాటు..మావోయిస్టు అగ్రనేతలైన జగన్, అరుణ, సుధీర్ తప్పించుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఐడీలు, 11 బ్యాగులు, క్యారేజీలు, ఇన్సాస్ చెందిన 15 రౌండ్లు ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్లు, 32 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు..తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.